జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసిన దేవరకొండ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రమావత్ హిమావంత్ కుమార్.
దేవరకొండ – (కొండ మల్లేపల్లి) ఆగస్టు 02 త్రినేత్రం న్యూస్. క్రీడలలో రాష్ట్ర స్థాయిలో రాణించి నియోజకవర్గాన్ని మంచిగుర్తింపుతీసుకురావాలని దేవరకొండ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రమావత్ హిమావంత్ కుమార్ అన్నారు. శనివారం కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రమావత్ హిమావంత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి 20116,రెండవ బహుమతి 15116,మూడవ బహుమతి, 10116 బహుమతులను రమావత్ హిమావంత్ కుమార్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….యువత అన్ని రంగాల్లో రాణించాలని ఆయన కోరారు . అనంతరం గుమ్మడవల్లి గ్రామ యువత పుట్టినరోజు వేడుకులు ఘనంగా నిర్వహించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈకార్యక్రమంలో షేక్ జహంగీర్ లాలయ్య, గిరి, లతిఫ్, శంకర్, చింటూ, మల్లేష్.. విష్ణు, కోటేష్ రమేష్. శివ. పరమేష్. రాకేష్. నాని, ఏడుకొండలు, సాయినాథ్. పంగ రాకేష్.. గోవర్ధన్, ఉదయ్,ఇలియాస్ పటేల్, హరికృష్ణ,వెంకటేష్,మున్నా, షేక్ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


