ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన షేక్ హాజీ అలీ
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని పట్టణంలోని లేబర్ కోర్టు పక్కన శనివారం గాంధీనగర్ నూరాణి అరబిక్ స్కూల్లో
డాక్టర్ భవ్య కంటి హాస్పటల్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు షేక్ హాజీ అలీ, ఈ సందర్భంగా షేక్ హాజీ అలీ మాట్లాడుతూ.. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ లో నిరుపేద ప్రజలకు కంటి చూపు సరిగా లేక కళ్ళలో నుండి నీరు రావడం, వారికోసం ఈ ఉచిత వైద్య శిబిరం. నిర్వహించామని ఆర్గనైజేషన్ అధ్యక్షుడు అన్నారు.
ఉచిత కంటి వైద్య శిబిరానికి వచ్చి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యురాలు డాక్టర్ భవ్య, వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకున్నారు. రాబోయే రోజుల్లో ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరపున ప్రజలందరికీ మరిన్ని సేవలు చేయబోతున్నట్లు అధ్యక్షులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మా్వో వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు జాకీర్ అలీ, జనరల్ సెక్రెటరీ షేక్ హుస్సేన్ బాజీ, జానీ ఆర్ట్స్, జాయింట్ సెక్రటరీలు ఎండి హసేన్, ఎండి ముబీన్. కోశాధికారి సయ్యద్ మోహిన్, లీగల్ అడ్వైజర్ ఎండి షానవాస్ చీఫ్ సెక్రటరీ ఎండి మునవర్, వైద్య సిబ్బంది సుమా, భాగ్య, షాహిద్, ఆటో యూనియన్ మాజీ జనరల్ సెక్రెటరీ సయ్యద్ బురఖాన్, అఫ్జల్, టిప్పు, అన్వర్, ఆఫ్రిది, షఫీ, సయ్యద్ ఖాదర్ అలీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App