Trinethram News : AP పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపటి నుంచి ఈ నెల 11 వరకు వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు.
రేపు శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో పర్యటించనున్న ఆమె.. ఉదయం రచ్చబండ, సాయంత్రం సభల్లో పాల్గొననున్నారు.
ఆ తర్వాతి రోజు శింగనమల, దర్శి, బాపట్ల, తెనాలి, జంగారెడ్డిగూడెంలో జరిగే కార్య క్రమాల్లో ఆమె పాల్గొననున్నారు.