
Severe Cyclone : అనకాపల్లి జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 25 ; రాష్ట్రంలో తీవ్ర తుఫాను నేపథ్యంలో హోం మంత్రి వంగలపూడి అనిత సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఆమె మాట్లాడుతూ, సోమవారం నుంచి విస్తరంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఐదు రోజులపాటు కలెక్టర్లు, ఎస్పీలతో సహా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ప్రమాదకరంగా ఉన్నటువంటి హోర్డింగులను వెంటనే తొలగించాలని సూచించారు. అవసరమైతే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్ బృందాలను ఉంచాలని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe