జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 11 at 10.08.10 PM

TRINETHRAM NEWS

వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

డైలీ భారత్, వరంగల్ జిల్లా:వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్ట డంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

సోమవారం ఉదయం జిల్లాలోని రాయపర్తి మండలం కృష్ణాపురం క్రాస్ రోడ్ వద్ద వేగంగా దూసు కొచ్చిన ఓ ద్విచక్రవాహనం.. రోడ్డు ప్రక్క ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మృతులను సంగెం మండలం ఎల్గూరు రంగం పేటకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోద చేసి దర్యాప్తు జరపనున్నట్లు పోలీసులు తెలిపారు

You cannot copy content of this page