TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమల కుంట గ్రామం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం. తిరుమల కుంట గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకాన్ని రేషన్, దుకాణాల్లో నేటి నుంచి నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ, రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు లబ్ధి, ఎన్నికల హామీలో భాగంగా సన్న బియ్యం పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం, రాష్ట్రంలో పేదల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసినది, సన్న బియ్యం పంపిణీలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోని తిరుమల
కుంట గ్రామంలో ప్రభుత్వ చౌక దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకులు జుజ్జూరి దుర్గారావు, టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు పల్లెల రామ లక్ష్మయ్య, కొనకళ్ళ లక్ష్మణరావు, పానుగంటి శ్రీనివాస్ రావు, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గడ్డం ఏసు, సేల్స్ మెన్ శ్రీకాంత్, తదితరులు పాల్గొని, రాష్ట్రంలో 85% ప్రజలు, ఈ పథకాన్ని పొందుతున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు, రాజీవ్ యువ వికాసం పథకాన్ని పొందుటకు ఈనెల 14 వరకు గడువు ఉంది అని యువత వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Senior Congress party leaders