శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా యేసు క్రీస్తు రాక గురించి, మరియు ఆయన జీవిత విశేషాల గురించి చిన్నారులచే వివిధ సన్నివేశాలతో వివరింపచేశారు. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థులు నృత్యాలు, పాటలు, రకరకాల ప్రదర్శనలతో అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ లోక రక్షణ కొరకు ఏసు ప్రభువు జన్మించి, ఎన్నో గొప్ప కార్యాలు చేసి, పాపములు చేసిన వారిని క్షమించి, వారికి సన్మార్గాలను నేర్పిన గొప్ప కరుణామయుడు అని కొనియాడారు. తదనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులందరికీ మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం అరవింద్ రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు మరియు పాఠశాల డీన్, శ్యామ్, కిరణ్ ఇంఛార్జి లు, స్రవంతి, తాస్లీం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App