నిబంధనలు పాటించని ఆస్పత్రులు సీజ్ మరియు చట్టరీత్య చర్యలు
డాక్టర్ వెంకటరమణ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వరంగల్: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ మరియు తన సిబ్బందితో కలిసి శివనగర్ లోని హెల్త్ లైన్ డయాగ్నొస్టిక్ సెంటర్ మరియు ఫోర్ట్ వరంగల్ లో ఆర్ఎంపి క్లినిక్ ను తనిఖీ చేసి సీజ్ చేయడం జరిగినది వీరు అర్హత లేకుండా మరియు రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్నందుకు వీరిపైన చట్టప్రకారం చర్యలు ఉంటాయని తెలిపినారు ప్రైవేట్ హాస్పిటల్స్ ,క్లినిక్కులు, పోలీక్లినిక్కులు, నడిపే వారు తప్పనిసరిగా నియమనిబంధనలు పాటించాలని కోరారు జిల్లాలో అన్ని క్లినిక్కులు, పోలీ క్లినిక్కులు, ల్యాబులు హాస్పిటల్స్ ,వెల్నెస్ సెంటర్లు, ఫీజియోథెరఫీ సెంటర్లు, కంటి దావకానలు క్లినిక్కులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, అలాగే ఆయుర్వేద, యునాని, హోమియో, సిద్ధ, యోగ, నేచురోపతి వంటి అన్ని దావకానలు క్లినిక్కులు కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని లేనిచో పెనాలిటీ వేసి సీజ్ చేయటము జరుగునని తెలిపినారు అటువంటి క్లినిక్కులు, ఆసుపత్రలపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడును అని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయిలోని ప్రత్యేక బృందాలు ప్రతి క్లినిక్, డయాగ్నొస్టిక్ సెంటర్ హాస్పిటల్స్ ఆయుష్ సెంటర్లను కూడా తనికీ చేసి నిబంధనల ప్రకారం లేని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడును అని తెలిపారు. ఆర్ఎంపీలు పీఎంపీలు
పేరుకు ముందు డాక్టర్ అని రాసుకోకుడదని వారి కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలనీ ఇంజెక్షన్లు, సెలైన్ లు పెట్టరాదని అల్లోపతీ వైద్యం చేయరాదని వారి దగ్గర మందుల నిల్వ ఉంచుకోరాదని అయన తెలిపారు.
విదేశాలలో వైద్య విద్య అభ్యసించిన డాక్టర్లు తప్పనిసరిగా FMGE టెస్టులో ఉతీర్ణులై, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాతనే హాస్పిటల్స్ లో వైద్యము చేయాలని తెలిపారు.
ప్రతి వైద్యుడు తప్పనిసరిగా ప్రిస్క్రిప్షన్ లెజబుల్ గా మాత్రమే వ్రయాలని కోరారు. ప్రతి క్లినిక్, పోలీక్లినిక్, నర్సింగ్ హోమ్ హాస్పిటల్ ఆయుష్ క్లినికల్, పోలీ క్లినిక్ ఆసుపత్రుల వారు వారి వారి సెంటర్లలో వసూలు చేయి ఫీజుల వివరములు తప్పనిసరిగా తెలుగు, ఇంగ్లీష్ భాషలో రిసెప్షన్ నందు బోర్డులు ఏర్పాటు చేయాలనీ, ఆ ప్రకారమే రోగుల నుండి చార్జీలు వసూలు చేయాలనీ, అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పరిశుభ్రత, సౌకర్యాలు అందించే విషయంలో ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని వారి, వారి ఇంస్టిట్యూట్స్లో పని చేసే వైద్యులు వారి రిజిస్ట్రేషన్ నంబర్లు, వారి వారి విద్యార్హతలు కూడా రిసెప్షన్ వద్ద ప్రదర్శించాలని కోరారు.
ప్రతి హాస్పిటల్ , నర్సింగ్ హోమ్ వారు నిర్ణయించుకున్న రేట్స్ (రాక్ రేట్లను) ప్రతి సంవత్సరం జూన్ నెల మొదటివారంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో అందచేయాలని లేనిచో కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
సి-సెక్షన్ కాన్పుల శాతం ఎక్కువగా ఉంటుంది అనవసరంగా ఇండికేషన్ లేకుండా సి-సెక్షన్ కాన్పులు చేస్తే అట్టి డాక్టర్లపై చర్యలతో పాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కు రాసి సదరు వైద్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎం టి పి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మాత్రమే నిబండలంకు లోబడి ఇద్దరు డాక్టర్ల సమక్షలో అబార్షన్ చేయాలనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు లేకుండా అర్హత లేని డాక్టర్లు అబార్షన్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
వచ్చిన జబ్బుల గురుంచి పేషెంట్లకు తప్పనిసరిగా వారికీ అర్ధమయ్యే భాషలో వివరించాలని, జబ్బుకు అయ్యే ఖర్చులని కూడా ముందుగానే వివరించాలని, రోగుల హక్కులు, బాధ్యతలు ప్రతి ఆసుపత్రలో తెలిపే విదంగా బోర్డులను ఏర్పాటు చేయాలనీ కోరారు.
మలేరియా డెంగ్యూ టీబీ, ఎయిడ్స్ వంటి వ్యాధులు సోకిన వారి వివరములు ప్రతినెలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు తెలపాలని కోరారు.
• జిల్లాలో తనికీ బృందాలు నిరంతరం క్లినిక్కులు, ఆస్పత్రలు, తనికీ చేస్తుంటాయని, తనికీ అధికారులు అడిగిన వెంటనే అన్ని రకాల అనుమతులకు సంబందించిన సర్టిఫికెట్లు, సిబ్బంది వివరములు ధరల పట్టికలు చూపించవలెనని తెలిపినారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ ,డిప్యూటీ డెమో అనిల్ కుమార్ ,ఎస్ ఓ విజయలక్ష్మి, ఎల్ డి కంప్యూటర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App