TRINETHRAM NEWS

స్తంభించిన ఎస్బిఐ సేవాలు.
వందలకోట్లు లావాదేవీ ఉన్నఎస్బిఐ, కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న సిబ్బంది .

అల్లూరి జిల్లా అరకులోయ: జనవరి 9.త్రినేత్రం న్యూస్!

అరకు వేలి స్టేట్ బ్యాంకు యాజమాన్యం నిర్లక్ష్యంతో 3 రోజుల నుండి సిబ్బంది లేక పనులు జరగకపోవడంతో ఇబ్బంది పడుతున్న ఎస్ బి ఐ వినియోగ దారులు…వినియోగదారుల మొర వినని యాజమాన్యం,ఇరుకు గదుల్లో సావసం.
అరకువేలి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు మాట్లాడుతూ అరకువేలి స్టేట్ బ్యాంకు యాజమాన్య నిర్లక్ష్యంతో గత మూడు రోజుల నుండి సేవలు అందుబాటులో లేకపోవడంతో సుదూరాల నుండి వచ్చి పనులు జరగకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నావినియోగదారులు.మూడు రోజుల నుండి కేవైసీ,జీరోఅకౌంట్ ను, జనరల్ ఎకౌంట్కి మార్చడం,ఇన్ యాక్టివ్ లో ఉన్న అకౌంట్లను యాక్టీవ్ లో తీసుకురావడం మొదలైన సేవలు చేసే కౌంటర్లలో సిబ్బంది లేక కాలి కుర్చీలు దర్శనమిస్తుండడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. అలాగే మూడు రోజుల నుండి వినియోగదారులు తమ వ్యవసాయ కూలీ పనులను విడిచిపెట్టి బ్యాంకు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది.ఈరోజు ప్రతి లావాదేవిలు, బ్యాంకు ద్వారా జరుగుతుండడంతో వినియోగదారులకు సకాలంలో బ్యాంక్ సేవలు అందుబాటులో లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.ఒకవైపు సంక్రాంతి పండగ, పిల్లలకు సెలవులు వస్తుండడంతో వినియోగదారులకు ఆర్థిక అవసరాలు అత్యవసరమవుతున్నాయి.

ఇటువంటి సమయంలో బ్యాంకులో సేవలు,ఇతర సాంకేతిక సమస్యల వలన నిలిపివేయడం వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. కావున ఇప్పటికైనా అరకువేలి స్టేట్ బ్యాంకులో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి కేవైసీ,ఇన్ ఆక్టివ్ ఉన్న ఎకౌంట్లను యాక్టీవ్ లో మార్చడానికి డబ్బు విత్ డ్రా, డిపాజిట్ చేయడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలి.ఒకే కౌంటర్లో రెండు మూడు సేవలు చేయడం వలన ఎక్కువ సమయం పడుతుండడంతో వినియోగదారులు గంటల తరబడి క్యూ లైన్లో నిల బడవలసిన పరిస్థితి వస్తుంది. కావున తక్షణమే అరకు వ్యాలీ స్టేట్ బ్యాంకు యాజమాన్యం స్పందించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించుటకు సమస్యలు పరిష్కారం చేయగలరని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల నాయకులు గత్తుం బుజ్జిబాబు,కుమ్మిడి రమేష్ ,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App