WhatsApp Image 2024 01 07 at 11.00.27 AM
Trinethram News : 7th Jan 2024
నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చింది: సీఎం రేవంత్
నెల రోజుల కాంగ్రెస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రజల ఆకాంక్షలను నిజం చేస్తూ సాగిన ఈ ప్రస్థానం తృప్తినిచ్చిందన్నారు. ‘‘సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ.. పాలనను ప్రజలకు చేరువ చేస్తూ.. అన్నగా నేనున్నానని హామీ ఇస్తూ చేసిన ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చింది. పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామంటూ.. నగరాల అభివృద్ధికి నగిషీలు చెక్కుతూ.. మత్తులేని చైతన్య తెలంగాణకు గట్టి పట్టుదలతో సాగిన పాలన బాధ్యతగా సాగింది. తెలంగాణ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఇక ముందు కూడా నా బాధ్యత నిర్వర్తిస్తా’’ అని తెలిపారు.
