TRINETHRAM NEWS

గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలి

క్రీడల్లో గెలుపు ఓటములు సహజం..

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రామ

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెద్దపల్లి మండలం కాపులపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మ్యాదర వేణి మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ టోర్నమెంట్స్ బుధవారం సాయంత్రం ముగిసాయి. ఇందులో విజేతలైన వారికి స్థానిక నాయకులతో కలిసి బహుమతులను అందించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ

క్రీడల్లో ఓడినా గెలిచినా నైపుణ్యం అభివృద్ధి చెందుతుందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుడ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. తెలుగు వారి సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబింప చేసే సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామీణ క్రీడ అయినటువంటి కబడ్డీ టోర్నమెంట్స్ నిర్వహించడం అభినందనీయమన్నారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా క్రీడలు క్రమశిక్షణకు దోహదపడతాయన్నారు. ఈ టోర్నమెంట్స్ ను స్ఫూర్తిగా తీసుకొని అన్ని గ్రామాల్లో ఇలాంటి గ్రామీణ క్రీడలు నిర్వహించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. విన్నర్ గా నిలిచిన వెంకట్రావుపల్లి జట్టుకు రూ.10 నగదు బహుమతిని, రన్నర్ గా నిలిచిన కాపులపల్లి జట్టుకు రూ .5 వేల నగదు బహుమతిని, షీల్డ్ లను ఎమ్మెల్యే అందజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్, మాజీ ఎంపిటిసి ఎడెల్లి శంకర్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు ముత్యాల నరేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జడల రాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు సాయి, సుకన్య, గాజుల ప్రవీణ్, నల్లపు తిరుపతి, పిట్టల స్వామి, పలువురు పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App