TRINETHRAM NEWS

Rulers not servants of the people – MLA Mkkhansingh Raj Thakur

ప్రజల కోరిక నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం, ప్రజా సంక్షేమమే మా ధ్యేయం, ప్రజా అభివృద్ధి మా కార్యచరణ, ప్రజలకు పాలకులం కాదు సేవకులం- ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్

800 మెగావాట్ల పవర్ ప్లాంట్ సాధన ఏడుగురు శాసనసభ్యులతో పాటు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి శ్రీధర్ బాబు, సలహాదారు వేనుగోపాల్ సహకారం మరువలేనిది- ఎమ్మెల్యే మక్కాన్సింగ్

స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసి సంవత్సరానికి 1000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పవర్ మినిస్టర్ హోదాలో ఏడుగురు శాసనసభ్యుల సహకారం మంత్రి శ్రీధర్ బాబు ప్రోత్సాహంతో ప్రోటోకాల్ చైర్మన్ వేణు సహకారంతో 4లక్షల ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయాన్ని 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ విస్తరణను చేపట్టాలని ప్రకటించడం యావత్ రామగుండం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్నదని గర్వంగా తెలియజేస్తున్నామని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రామగుండం పారిశ్రామిక ప్రాంతం మసక బారి పోయినదని గత బీఆర్ఎస్ హయాంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఒక కంపెనీ కాదు కదా కనీసం చిన్న కార్యాలయము కూడా ఏర్పాటు చేయబడలేదు అని మరి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజా ప్రభుత్వం అని ప్రజా సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పాటు వివిధ శాఖల మంత్రులు కట్టుబడి ఉన్నారని, అదేవిధంగా 800 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ సాధనలో నాలుగు లక్షల ప్రజల కోరికను దృష్టిలో ఉంచుకొని పవర్ ప్లాంట్ ఏర్పాటును త్వరలోనే చేపడతామని తెలియజేసిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్, విజయరమణారావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎంపీ వంశీకృష్ణ, గడ్డం వినోద్, వివేక్ పాటు సింగరేణి సిఎండి బలరాం నాయక్ కలెక్టర్లు హర్ష, అరుణ తదితరులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మాట్లాడడం జరిగినది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ లతో పాటు ఆయా విభాగాల అధ్యక్షులు పాత్రికేయులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rulers not servants of the people - MLA McConsingh Raj Thakur