
RTC Bus-Bike Collision : చందం పేట ఆగష్టు 09, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా చందంపేట మండలం సర్కిల్ తండా వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
వాయిల పల్లి వజ్రమ్మ భర్త ఈదయ్య వయసు :50 సంవత్సరాలు ,గ్రామం :పొగిళ్ల ఇచ్చిన దరఖాస్తు ప్రకారం తన చిన్న కొడుకు శ్రీను వయసు : 38 సంవత్సరాలు అతడు ఆదివారం రోజు ఉదయం తన సొంత పనిమీద మల్లెపల్లి కి పోయి, తిరిగి ఇంటికి తన పల్సర్ బైక్ నెంబర్ TS 05 F F 6232 పై వస్తుండగా గుంతల తండా, సర్కిల్ తండాలకు మధ్య గల తెల్ల పలుగు గుట్ట వద్దకు వచ్చేసరికి 11 గంటల 15 నిమిషాల సమయంలో పాత కంబాల పల్లి నుండి బయలుదేరిన ఆర్టీసీ బస్సు నెంబర్ TS 05 Z 0170 బస్సును నడుపుతున్న డ్రైవర్ ఎండి ఆలం తన యొక్క బస్సును అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ, తనయొక్క కొడుకు నడుపుతున్న పల్సర్ బైకుకు ఎదురుగా డీకొనగా తన కొడుకు అక్కడికక్కడే చనిపోయినాడు.
బైకు కూడా డ్యామేజ్ అయినది. ఇట్టి సమయంలో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా చూసినారు. కావున పోలీసులు విచారించి బస్సు డ్రైవర్ ఎం డి ఆలం పై తగిన చర్యలు తీసుకోమని దరఖాస్తు ఇవ్వగా అట్టి దరఖాస్తు పై చందం పేట ఎస్ ఐ లోకేష్ ఘటనా స్థలానికి చేరుకుని యాక్సిడెంట్ పై విచారణ చేసి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe