ఆగస్ట్ 31, 2026
TRINETHRAM NEWS
Agricultural Officer

రైతులు పొలాలను బీడు గా ఉంచరాదు. డిండి మండల వ్యవసాయాధికారి:– రెహానా.

Agricultural Officer : డిండి (గుండ్ల పల్లి) ఆగష్టు 09, త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని ఎర్రారం గ్రామంలో బీడుగా ఉన్న పంట పొలాలను మండల వ్యవసాయాధికారి రెహానా సందర్శించారు. . ఆమె ఈసందర్భంగా రైతులతో మాట్లాడారు … రైతులకు పొలాలను బీడుగా ఉంచకుండా కంది, మినుము, పెసర వంటి ఆరుతడి పప్పుధాన్య పంటలను సాగు చేయాలని సూచించారు.

పప్పుధాన్యాల సాగు వల్ల కలిగే ప్రయోజనాలు, నేల సారవంతత పెంపు మరియు తక్కువ నీటి వినియోగం గురించి రైతులకు అవగాహన కల్పించారు. కొంతమంది రైతులు పెసర సాగు చేసేందుకు అంగీకరించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎర్రారం గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వరసాల లక్ష్మయ్య , ఉపసర్పంచ్ అబ్దుల్ సమీ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page