TRINETHRAM NEWS

ఆర్.ఎఫ్.సి.యల్ టౌన్షిప్ లో రోడ్డు భద్రతా వారోత్సవాలు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్.ఎఫ్.సి.యల్ సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత వారోత్సవాలు ఘనంగా నిర్వహించటం జరిగింది. భద్రతా వారోత్సవాల సందర్భంగా టౌన్షిప్ లోని,
శ్రీ చైతన్య సి.బి.యస్.ఇ. పాఠశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆర్.ఎఫ్.సి.యల్ భద్రతా విభాగం ముఖ్యఅధికారి సత్యనారాయణ హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించి రోడ్డుపై వెళ్ళేటపుడు నియమ నిబంధనలు పాటించాలని, రోడ్డుపై వెళ్ళే ఇతర వాహనదారులకు, పాదచారులకు ఇబ్బంది కలుగకుండా రోడ్డు ప్రక్కలకు ఉన్న బోర్డులను గమనిస్తు ముందుకు వెళ్ళాలి అన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్.ఎఫ్.సి.యల్ సంస్థ డిప్యూటీ మేనేజర్ విజయ్ విద్యార్థులు పాఠశాలకి సైకిళ్ళపై వచ్చే సందర్భంలో రోడ్లపై ముచ్చటిస్తు సైకిళ్ళు నడపరాదని, తల్లిదండ్రులతో పాఠశాలకు వచ్చేటపుడు నియమిత వేగం పాటించాలని, వాహనాలు నడుపునపుడు ఇతరులకు ఇబ్బంది లేకుండా చూడాలని, 18 సంవత్సరాలు నిండి లైసెన్స్ పొందిన తర్వాతనే విద్యార్థులు వాహనాలని నడపాలని, ట్రాఫిక్ సిబ్బందికి ఎలాంటి ఆటంకాలు కలిగించరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ రవి, డీన్ రమేష్, ప్రైమరీ బాధ్యులు సౌజన్య, ‘సి’ బ్యాచ్ బాధ్యులు ప్రశాంతి, క్యాంపస్ ఇంచార్జ్ నరేంద్ర కుమార్, అధ్యాపక బృందం, విద్యార్థులు ఆర్.ఎఫ్. సి. యల్ సంస్థ ప్రతినిధులు గోపాల్ కుమార్, అవినాష్ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App