
Trinethram News : హైదరాబాద్: సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ.. ప్రజాసేవకు కాదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో ప్రజానీకానికి ఎంతో సేవ చేసి గ్రామ సర్పంచ్‌లుగా పదవీ విరమణ చేస్తున్న వారికి ఆయన ‘ఎక్స్’(ట్విటర్) వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ ధామాలు నెలకొల్పడంలో.. రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపిన కృషిలో మీ పాత్ర ఎనలేనిదని కొనియాడారు. మరింతకాలం ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
