
ఈనెల 14 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో ఆంక్షలు
సంక్రాంతి పండుగను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా నిర్వహించుకోవాలని హైదరాబాద్ సీపీ శ్రీనివాసరెడ్డి కోరారు.
పతంగులు ఎగురవేసే వేళ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
అనుమతి లేకుండా రాత్రి 10నుంచి ఉదయం 6గంటల వరకు ఎలాంంటి లౌడ్‌స్పీకర్లు ఉపయోగించకూడదని సూచించారు.
ఈ నెల 14 ఉదయం నుంచి 16వ తేదీన ఉదయం వరకు పోలీసుల ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు
