WhatsApp Image 2025 01 31 at 19.22.53
శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలి
ఉద్యోగ విరమణ పొందిన అధికారులను సన్మానించి,జ్ఞాపికలు అందజేసిన, కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి)
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, పోలీస్ శాఖ లో సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులను రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ఉద్యోగ విరమణ కార్యక్రమంలో రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) పాల్గొని పదవీ విరమణ పొందుతున్న ఏడుగురు పోలీసు అధికారుల కుటుంబ సభ్యుల తో కలిసి శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగ విరమణ పొందిన ఎస్.
సుందర్ రావు, ఏ ఆర్ ఏసీపి,శారదా మహిళ సబ్ ఇన్స్పెక్టర్,శాలువతో ఘనగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ. గతంలో పోలీసు వ్యవస్థ అత్యంత క్లిష్ట పరిస్థితుల నందు సంఘవిద్రోహశక్తులతో పోరాడి కీలకంగా విధులను నిర్వర్తించి ప్రస్తుతం పోలీసు వ్యవస్థ ప్రశాంతంగా ఉండడానికి గల కారణమైన అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. సుదీర్ఘ కాలం పాటు పోలీసు వ్యవస్థను సేవలందించి పదవీ విరమణ పొందుతున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలను పోలీసులు సక్రమంగా విధులను నిర్వర్తించడానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉంటుందని వారి తోడ్పాటు వల్లనే విధులను నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగగలరని తెలియజేశారు. పదవీ విరమణ పొందిన తర్వాత వచ్చే ప్రయోజనాలను త్వరగా అందించాలని సిబ్బందికి తెలియజేశారు. పదవి విరమణ చేసిన మీరు ఇకపై కుటుంబ సభ్యులతో తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆనందంగా గడపాలని సూచించారు. తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు.
ఎటువంటి అవసరం ఉన్న కమీషనరేట్ పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. పదవి విరమణ పొందిన అధికారులను ప్రభుత్వ వాహనంలో ఇంటి వరకు సాగనంపడం జరిగింది.ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి అడ్మిన్ సి.రాజు, ఏసీపీ గోదావరిఖని ఎం. రమేష్, ఏఓ శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు వామన మూర్తి , సంపత్, ఆర్ ఎస్ఐ లు ప్రవీణ్ కుమార్, సరిత, రామగుండం పోలీస్ కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లా కుంట పోచలింగం, స్వామి, పదవి విరమణ అధికారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
