TRINETHRAM NEWS

Ration rice should be supplied regularly

జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్

మంథని, జూలై -6: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ప్రజలకు సక్రమంగా సరఫరా చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు.

శనివారం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ మంథని మండలంలోని పలు రేషన్ షాపులను ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ మైదుపల్లి గ్రామంలో రేషన్ షాప్ నంబర్ 29 తనిఖీ చేయగా 3.60 క్వింటాళ్ల బియ్యం ఎక్కువగా, గుమ్మనూరు గ్రామంలో రేషన్ షాప్ నెంబర్ 5 తనిఖీ చేయగా పది క్వింటాలు తక్కువగా గుర్తించామని , సదరు రేషన్ డీలర్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ నియంత్రణ ఉత్తర్వులు 2016 ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

రేషన్ డీలర్లు ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యాన్ని ప్రజలకు సక్రమంగా సరఫరా చేయాలని, అలా కాకుండా అక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోబడతాయని ఆయన హెచ్చరించారు.

ఈ తనిఖీలలో ఎన్ఫోర్స్మెంట్ సంబంధిత అధికారులు, తదితరులు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంట ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ration rice should be supplied regularly