Ramagundam Municipal Corporation should be converted into Ruda Ramagundam Urban Development Authority
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
సుందిళ్ల నుండి రామగుండం గోదావరి పరివాహక ప్రాంతంలో కరకట్ట నిర్మించాలి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఖనికి తరలించాలి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలి
ఖనిలో పలు ప్రధాన సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కలిసి విన్నవించిన డిహెచ్పిఎస్ నాయకులు
దళిత హక్కుల పోరాట సమితి (DHPS) పక్షాన గురువారం రోజున జిల్లా కలెక్టర్ గోదావరిఖనిలో పలు ప్రధాన సమస్యల పై డి హెచ్ పి ఎస్ నాయకులు కందుకూరి రాజారత్నం మద్దెల దినేష్, ఏర్రాల రాజయ్య, బొద్దుల రమేష్ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు.
అనంతరం డి హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దెల దినేష్, మాట్లాడుతూ రానున్న వర్ష కాలంలో గతంలో లాగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే సుందిళ్ళ నుండి రామగుండం వరకు పారివాహక ప్రాంతంలో దాదాపు 5 కిలో మీటర్ల దూరం కరకట్ట నిర్మాణం చేయాలని, దానికి సంబంధించిన ఓపెన్ కాస్ట్లు మట్టి మనకు అందుబాటులో ఉందని, కరకట్ట నిర్మాణం లేకపోయేసరికి రామగుండం నగరపాలక సంస్థలో మల్కపూర్ 5వ డివిజన్ , సప్తగిరి కాలిని, 6వ డివిజన్ ప్రశాంత్ నగర్, శ్రీనగర్, గంగనగర్, జనగామ 9వ డివిజన్ తదితర ప్రాంతాలలో వరద నిరు చేరి ఇండ్లు, పొలాలు నిటమునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు.
అదేవిధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ను రామగుండం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (RUDA) గా మార్చాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.
రామగుండం ప్రాంతానికి మంజూరు అయిన సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇప్పటికీ కూడా గోదావరిఖనికి రాకపోవడం బాధాకరం అని ఎందుకు జాప్యం జరుగుతుందని, కావున త్వరితగతిన ఖని లో సబ్ రిజిస్టర్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు.
గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో దళిత బంధు పథకంలో భాగంగా అర్హులైన వారి పేర్లతో ప్రకటించి ఎన్నికల అనంతరం దాని రద్దు చేయడం బాధాకరం అని, ఇప్పటికైనా దళితబందు పథకాన్ని అమలు చేయాలని, అదే విధంగా టీ, ప్రైడ్ పథకం పున ప్రారంభించాలని కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్లడం జరిగిందన్నారు.
ఆర్ఎఫ్సిఎల్ ద్వారా గోదావరి నీరు మొత్తం కలుషితం అవుతుందని RFCL లో జెడ్ ఎల్ డి ప్లాంట్ కు ఆదేశాలు జారి చేయాలని చెప్పడం జరిగిందన్నారు.
గోదావరిఖని లోని గోదావరి బ్రిడ్జి పై నుండి దూకి అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కావున బ్రిడ్జి పై పెన్షింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
ఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగులకు కనీస సౌకర్యాలు కరువైనాయని ఆస్పత్రిలో రోగులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని అసలు ఆస్పత్రికి సుపరిడెంట్ ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కావున నూతన సుపరిండెంట్ ను నియమించాలని,మరియు మీరు అసూత్రిని ఆకస్మిక తనిఖిలు చేయాలని, అదే విధంగా మెడికల్ కళశాల ప్రిన్సిపల్ బదిలి చేయాలన్నారు. పేరుకే వారధి ఉందని ఉద్యోగాలు మాత్రం ఫై అని పేర్కొన్నారు. ఇక పోతే ఖని విఠల్ నగర లోని నిలిచిపోయిన మల్టిగ్రెడ్ మార్కెట్ పనులు పునప్రారింబిచాలని కోరామన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎస్టిపి లు ఏర్పాటు చెపించాలని కోరామన్నారు
గోదావరిఖనిలో అర్బన్ తహశీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని, అదే విధంగా మండల విద్యాదికారి కార్యాలయం గోదావరిఖని కి తరలించాలని కోరడం జరిగిందన్నారు.
పెద్దపల్లి జిల్లాలో కేంద్రంలోని ప్రజల చిరకాల కోరిక ఆర్టీసీ డిపో, కావున ప్రజల, ప్రయాణికుల దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ డిపొ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు.
పై విషయాలను అన్ని కూడా ప్రజలకు ఉపయగపడుతాయని జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా వివరించడం జరిగిందన్నారు వారు కూడా సానుకూలంగా స్పందించారని అని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App