
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా క్రైస్తవ మైనారిటీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభించబడింది. ఈ పథకం ద్వారా అర్హులైన క్రైస్తవులకు గరిష్టంగా రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. సహాయం కింద 70 శాతం నుండి 100 శాతం వరకు సబ్సిడీ అందించబడుతుంది దరఖాస్తుదారులు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్ (నీటిపారుదల వ్యాపారాలకు), సదారెం సర్టిఫికేట్ (వికలాంగులకు మాత్రమే), కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం మరియు బాప్టిజం సర్టిఫికేట్‌లను సమర్పించాల్సి ఉంటుంది
ఈ అవకాశాన్ని క్రైస్తవులందరూ వినియోగించుకోవాలని పెద్దపల్లి జిల్లా ఇంటర్ – డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ ఎం. మహిపాల్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి పాస్టర్ పి. డిలైట్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పాస్టర్ బి. రవి పాల్, సంయుక్త కార్యదర్శి పాస్టర్ జె. ప్రజార్షి, ఉప కోశాధికారి పాస్టర్ డి. గాబ్రియేల్, కార్యనిర్వాహక సభ్యులు పాస్టర్ రవి వర్మ, పాస్టర్ ఈ. థామస్, పాస్టర్ చందర్ పాల్, పాస్టర్ ప్రభాకర్ పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
