TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ : ఏప్రిల్ 2, 3,4 తేదీల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

శుక్రవారం విడుదల చేసిన రోజువారీ వాతావరణ నివేదిక ప్రకారం.. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉంది. అయితే, రాబోయే ఐదు రోజులు పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది.

గత 24 గంటల్లో తెలంగాణలో పొడి వాతావరణం నెలకొంది, గురువారం ఆదిలాబాద్‌లో అత్యధికంగా 40.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 36 – 41 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. కాగా ఇటీవల రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అకాల వర్షాల వల్ల పలు చోట్ల పంట నష్టం కూడా జరిగింది.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌ నగరంలో ఎండ తీవ్ర కొనసాగుతోంది. శుక్రవారం ముషీరాబాద్‌లో అత్యధికంగా 40 డిగ్రీలు, షేక్‌పేట్‌లో 39.9, నాంపల్లిలో 39.9, ఖైరతాబాద్‌లో 39.9, అసిఫ్‌నగర్‌లో 39.9, చార్మినార్‌లో 39.9, బండ్లగూడలో 39.9, సైదాబాద్‌39.8, బహదూర్‌పురాలో 39.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rain forecast again for