
ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 29 : అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో అరుకు కేకే లైన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రైల్వే బోర్డు ప్రకటించిన కనీస వేతనాలు జీవో అమలు చేయాలని లేబర్ కమిషనర్ కి సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో కాంట్రాక్టర్ కార్మికులను తొలగిస్తామని బెదిరింపులు చేస్తూ కార్మికులు పనికి రాకుండా ఆపారు తక్షణం తొలగించే ఆలోచన విరమించుకోవాలని శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ అభినకాంత్ బిస్వంన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది..
కార్మికులు కు జీవో ప్రకారం వేతనాలు చెల్లించకుండా రైల్వే కాంట్రాక్టర్లు కార్మికుల శ్రమను దోచేస్తున్నారని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు పత్రిక ప్రకటన తెలియజేశారు. గతంలో అనేకసార్లు రైల్వే అధికారులకి విన్నవించిన సమస్య పరిష్కారం కాకపోవడంతోనే లేబర్ కమిషనర్ను కలవడం జరిగిందని అందుకు కాంట్రాక్టర్లు కార్మికులపై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ తొలగిస్తామని బెదిరింపులు పాల్పడుతున్నారని అన్నారు కార్మికులు ఎటువంటి బెదిరింపులు కి భయపడద్దని తెలియజేశారు తొలగించే ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున కార్మికులతో ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి సన్యాసిరావు, మధు, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
