జూలై 7, 2026

WhatsApp Image 2024 11 21 at 5.28.49 PM

TRINETHRAM NEWS

అయ్యప్ప సేవలో కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత….

Trinethram News : Medchal : ఈరోజు 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ ఏపిహెచ్ బి కాలనీలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ హరిహరసుతుడు అయ్యప్పను కొలవడం ద్వారా ఆపదలు తొలగి మానసిక ప్రశాంత, అష్టైశ్వర్యాలు చేకూరుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, దేవాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కమిటీ సభ్యులు ఆంజనేయులు, కృష్ణంరాజు, మువ్వా శ్రీనివాస్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు ఎర్వ సాయి కిరణ్, సంక్షేమ సంఘం సభ్యులు రామచంద్రరావు, ధనుంజయ్ రావు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page