TRINETHRAM NEWS

Police are responsible for public safety and security

నేరాల నియంత్రణకే ‘కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం గోదావరిఖని ఏసీపీ రమేష్

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ స్టేషన్ పరిధిలోని హోసింగ్ బోర్డు కాలనీ లో ఈరోజు రామగుండం సీఐ అజయ్ బాబు, రామగుండం ఎస్ఐ సతీష్ ఆధ్వర్యంలో గోదావరిఖని సబ్ డివిజన్ అధికారులు మరియు సిబ్బంది తో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించి కాలనీ లో తనిఖీ లు నిర్వహించి, స్థానిక ప్రజలతో గోదావరిఖని ఏసీపీ రమేష్ మాట్లాడడం జరిగింది.

Police are responsible for public safety and security

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని , కాలనీ లో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని, యువత చెడు అలవాట్లకు గంజాయి, మద్యం, డ్రగ్స్ లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కాలనీ లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్, వాట్సాప్ కాల్స్ లకు స్పందించవద్దని సూచించారు.

ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. కాలనీ లో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రామగుండం సీఐ అజయ్ బాబు,గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ సతీష్, గోదావరిఖని 1, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Police are responsible for public safety and security