TRINETHRAM NEWS

People should be avoided in the name of public governance and government schemes

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఎన్నికల కోడ్ ముగిసిన మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ చేయక పోవడం వల్ల విద్యుత్ మరియు గ్యాస్ సబ్సిడీ కోల్పోతున్న లబ్దిదారులు

ప్రజాపాలన దరఖాస్తులను వెంటనే ఆన్లైన్ చేసి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలను అమలు చేయాలి

నగర పాలక సంస్థ కమిషనర్ గారిని కోరిన డిహెచ్పిఎస్ నాయకులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన దరఖాస్తులను రామగుండం కార్పొరేషన్ లో ఆన్లైన్ చేయక పోవడం వల్ల లబ్దిదారులు కరెంట్ సబ్సిడీ మరియు గ్యాస్ సబ్సిడీ కోల్పోతున్నారని డి హెచ్ పి ఎస్ నాయకులు కందుకూరి రాజారత్నం, మద్దెల దినెష్ గంగారపు ప్రసాద్ లు ఆరోపించారు.

అనంతరం డిహెచ్పిఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దెల దినేష్
మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరు గ్యారంటీ ల పేరుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో లబ్దిదారుల నుండి పెద్ద ఎత్తున దరఖాస్తు లు తీసుకుందని, కాని

రామగుండం కార్పొరేషన్ లో దరఖాస్తులను సరిగా ఆన్లైన్ చేయకపోవడం వల్ల లబ్దిదారులు ప్రభుత్వ సబ్సిడిలను కోల్పోతున్నారని అయిన ఆరోపించారు. కార్పొరేషన్ నిర్లక్ష్యం వల్ల లబ్దిదారులు మళ్ళీ దరఖాస్తులు కార్పొరేషన్ కార్యాలయం కు వచ్చి అందజేయడం వల్ల జిరాక్స్ రవాణా ఖర్చులు భరిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల కోడ్ రావడంతో మొత్తానికే అన్ లైన్ చేయడం నిలిపివేశారు.
కోడ్ ముగియడంతో సవరణపై ఆశలు పెట్టుకుంటే ఇంతవరకు కూడా ఆన్లైన్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లాలో పెద్దపల్లి, మంథని డివి జన్ల పరిధిలో మొత్తం 2,06,518 విద్యుత్తు కనెక్షన్లున్నాయి. శాసనసభ ఎన్నికల సమయంలో ఆరు గ్యారం టీల అమలు కోసం ప్రజాపాలనలో తెల్ల రేషన్ కార్డులున్న వినియోగదా రుల నుంచి గృహజ్యోతి పథకానికి దరఖాస్తులు స్వీకరించారు. కార్పొరేషన్ అవగాహన లోపంతో కొంత మంది దరఖాస్తు పత్రాలను ఆన్లైన్ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దానితో రాయితీ పొందలేకపోతున్నారు.

సవరించే క్రమంలో లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో తాత్కాలికంగా ప్రక్రియను నిలిపివేశారు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో కోడ్ ముగిసింది. దీంతో దరఖాస్తుల సవరణ ప్రక్రియను ప్రారంబించాలి రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ గారిని మంగళవారం కోరడం జరిగిందన్నారు.

పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే ప్రారంభిస్తామని పత్రిక ప్రకటన ద్వార ప్రజలకు తెలియజేస్తామని కమిషనర్ గారు తెలియజేసారన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App