TRINETHRAM NEWS

PSLV c59 ఉపగ్రహ ప్రయోగం వాయిదా

Trinethram News : Andhra Pradesh : భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ- ఇస్రో తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి ఈ సాయంత్రం 4 గంటల 8 నిమిషాలకు చేపట్టాల్సిన PSLV-C59 రాకెట్‌ ప్రయోగం రేపటికి వాయిదా పడింది.

ఈ ప్రయోగానికి సంబంధించి మంగళవారం మధ్యాహ్నం 2గంటల 38 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ప్రోబా 3 లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని యూరోపియన్ శాస్త్రవేత్తలు గుర్తించారు.

దీంతో ప్రయోగాన్ని వాయిదా వేసి రేపు సాయంత్రం 4గంటల 12 నిమిషాలకు PSLV-C59 రాకెట్ ను నింగిలోకి పంపనున్నట్లు ఇస్రో సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App