TRINETHRAM NEWS

Protection of Lawyers Act should be brought

౼ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్


Trinethram News : న్యాయవాదులపై జరుగుతు న్న దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని రాష్ట్ర బీసీ కమిషన్ మెంబెర్ శుభప్రద్ పటేల్ అన్నారు. జనగామలో న్యాయవాదులపై దాడికి నిరసనగా వికారాబాద్ బార్ కౌన్సిల్ అద్వర్యం లో న్యాయవాదులు చేస్తున్న నిరసన దీక్షకు శుభప్రద్ పటేల్ సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ… ఇటీవల న్యాయవాదులపై ప్రతి చిన్న విషయానికీ దాడులు జరుగుతున్నాయని, దాడుల నుంచి న్యాయవాదు లకు సరైన భద్రత ఉండాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం ప్రత్యేక చట్టాన్ని ప్రభుత్వాలు తీసుకురావాల్సిన అవ సరం ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర కీలకమైందని, ప్రజల హక్కులను కాపాడేందుకు ప్రతి నిత్యం ప్రజల పక్షాన పోరాడే న్యాయవాదుల పై దాడి సరికాదని శుభప్రద్ పటేల్ తెలిపారు.

ఈ క్రమంలోనే సాయంత్రం దీక్ష చేస్తున్న న్యాయవాదులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.
ఈ కార్యక్రమంలో .. ప్రెసిడెంట్ అశోక్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ కయ్యుమ్, జనరల్ సెక్రెటారీ వెంకటేష్ సీనియర్ న్యాయవాదులు కమల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, బస్వరాజు, సంపూర్ణ ఆనంద్, యాదవ్ రెడ్డి, మాధవ్ రెడ్డి, నారాయణ,వసుంధర, జగన్, కిరణ్ పటేల్,రఫీ, మహేశ్వర రెడ్డి, శ్రీనివాస్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Protection of Lawyers Act should be brought