TRINETHRAM NEWS

ములుగు మండలంలోని జాకారం గ్రామంలోని సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ …

తేదీ: 13.01.2023 శనివారం అనగా ఈరోజున ములుగు మండల జాకారం గ్రామంలోని అంతర్గత రోడ్డుకు సీసీ రోడ్డు మంజూరు అవగా గ్రామ అధ్యక్షులు ఎండి.లాల్ గారి ఆధ్వర్యంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ములుగు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్  విచ్చేసి కొబ్బరికాయ కొట్టి సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ సీతక్క పంచాయితీ రాజ్ మంత్రి అయిన నెలలోపే జిల్లాకు 2 కోట్ల 50 లక్షల రూపాయల సీసీ రోడ్లు తీసుకువచ్చింది అని, ములుగు జిల్లాను అభివృద్ధి చేయాలంటే అది సీతక్క గారితో మాత్రమే సాధ్యం అని అన్నారు. మేడారం జాతరకు 75 కోట్లు తీసుకువచ్చి జాతర సమయంలో భక్తులు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేస్తుంది సీతక్క గారని, ములుగు జిల్లాకు సీతక్క గారి లాంటి నాయకురాలు ఉండడం ఎంతో అదృష్టం అని అన్నారు. అనంతరం జాకారం గ్రామస్థులు కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ గౌడ్ గారిని శాలువాతో సన్మానించారు.

 ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండి. చాంద్ పాషా, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల భరత్ తదితర నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.