
ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జరిగిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చి అందించిన ప్రజా వినతులు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జై న్ అదనపు కలెక్టర్ లింగ్య నాయక్ అదనపు కలెక్టర్ స్తానిక సమస్థలు సుదీర్, ఆర్డిఓ వాసు చంద్రగార్లతో కలిసి స్వీకరించారు.
ఈ రోజు ప్రజావాణిలో మొత్తం 79 దరఖాస్తులు రాగా, భూ సమస్యలు, ఇతర సమస్యల కు సంబంధించి ధరఖాస్తులు వచ్చాయని, వివిధ శాఖలకు చెందిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో వారికి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో , జిల్లా అధికారులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
