
ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు?
Trinethram News : సీఎం చంద్రబాబు సారథ్యంలో సమావేశం కానున్న కేబినెట్ భేటీ వాయిదా పడే అవకాశముందని తెలుస్తోంది. గురువారం పిబ్రవరి 20వ తేదీ ఉదయం 11.00 గంటలకు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది.
అయితే అదే రోజు న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.
ఆ క్రమంలో ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు సైతం హాజరయ్యే అవకాశముందని సమాచారం. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం వాయిదా పడే అవకాశముందని ఓ చర్చ నడుస్తోంది.
అయితే ఈ అంశంపై ఇంకా అధికారిక ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడలేదు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
