TRINETHRAM NEWS

మా రహదారి సమస్యను పరిష్కరించండయ్యా

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్, అల్లూరిజిల్లా ఇంచార్జ్ : ( కొయ్యూరు మండలం ) అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, బూదరాళ్ళ, పంచాయతీలోని బాలరేవుల,లోయలపాలెం, రహదారి మీదుగా ప్రయాణించాలంటే రహదారి బురద మయంగా తయారై ప్రయాణికులకు, తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఈ రహదారి మీదుగా నూక రాయి తోట, పోకల పాలెం, గోధుమ లంక,చీరిపల్లి,వంతమర్రి, కన్నవరం,పిట్టలపాడు, గరిమండ, గరికిబంధ, నల్లబెల్లి, బొడ్డుమామిడి, పోతవరం,రాజులపాడు,మరియు పామురాయి గ్రామాలకు వెళ్లాలంటే గిరిజన ప్రజలకు నరకప్రాయంగా ఉందని చెప్పుకోవాలి. కావున అధికారులుస్పందించి ఈ రహదారి సమస్యను పరిష్కరించాలని ఈ ప్రాంత వాసులు మీడియా ముందు తమమొర వినిపించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App