TRINETHRAM NEWS

బెల్టుకు ఆడేది.

డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.

బెల్ట్ షాపులను అడ్డుకునేది ఎవరు.
ఏరులై పారుతున్న మద్యం.
మత్తుకు బానిస అవుతున్న యువత.
మొద్దు నిద్ర పోతున్న ఎక్సైజ్ శాఖ.
ఎలక్షన్ టైం లోనే కేసుల . తర్వాత ఏరులై పారుతున్న మద్యం బెల్టు షాపులు. అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే మామూలు కమిషన్ తీసుకొని మాకేమి తెలియనట్టు మేమేం చూడనట్లు వ్యవహరిస్తున్నారు. యువత మద్యానికి బానిస లై భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారయింది. యువకుల జీవితం అంధకారంలోకి వెళ్తుంది
గ్రామాల్లో బెల్ట్ షాపులు గల్లీకి ఒకటి చొప్పున అయ్యాయి.
ముందు కిరాణం షాప్ లోపల బెల్ట్ షాపు.24/7 నడుస్తున్నాయి
మద్యం మత్తులో దోపిడీ దొంగతనాల కు పాల్పడుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు పట్టించు కోకపోవడం వల్ల పోటీపడి మరి బెల్ట్ షాపులు పట్టణం గ్రామాల్లో పుట్టగొడుగుల్ల పుట్టుకొస్తున్నాయి.

బెల్ట్ షాపులు అన్నిచోట్ల ఉన్నాయి అని అధికారులు మానం.

పట్టణాల్లో గ్రామాల్లో ఉదయం రాత్రి అని తేడా లేకుండా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా కొనసాగు తున్నాయి. కొత్తగా ఎక్సైజ్ శాఖ మద్యం పాలసీ తీసుకొచ్చినా, ఎమ్మార్పీ రేట్లకే మద్యం అమ్మేలా, కల్తీ మద్యం ను అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
అయితే అధికారులు పట్టించుకోకపోవడంతో బెల్ట్ షాపుల నిర్వాహకులకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
ఒక్కొక్క గ్రామంలో 5 నుండి 10…, 12 బెల్ట్ షాపులు ఉన్నాయంటే అక్రమ మద్యం మేరకు ఏరులై పారుతుందో అర్థం చేసుకోవచ్చు

నల్గొండ జిల్లా డిండి మండలంలో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామంలో మద్యం విక్రయాలు జోరు అందుకున్నాయి.
గ్రామాల్లో కిరాణం పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసుకున్న బెల్ట్ షాపు లు ఉదయం నాలుగు గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉంటున్నాయి.
గ్రామాల్లో యువకులు, మద్యానికి బాని సలై పనులకు వెళ్లకుండా బెల్ట్ షాపులోనే తాగుతున్నారు. గ్రామాల్లో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు లాభార్జన ద్యేయంగా గ్రామీణ ప్రాంతాల వారికి విక్రయిస్తున్నారు.
రహదారుల వెంట మద్యం విక్రయించవద్దన్న నిబంధనలు ఉన్నా గ్రామాలలో రోడ్ల పక్కన విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారు.

వ్యాపారులు పోలీసులు ఎక్సైజ్ అధికారులు చేతులు తడితే తమ వ్యాపారాలు నిరాటకంగా సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు సంబంధిత అధికారులకు విన్నవించుకుంటున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App