TRINETHRAM NEWS

Plant care is everyone’s responsibility

రామగుండం కమీషనరేట్ లో ఘనంగా 75వ వన మహోత్సవ కార్యక్రమం

మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత..

పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఎంతో దోహదపడుతుంది : పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ప్రతి ఒక్కరు “EACH ONE PLANT ONE” అనే నినాదం తో మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో బాగంగా ఈరోజు రామగుండం పోలీస్ కమీషనరేట్ ఆవరణలో రామగుండము పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) పోలీస్ అధికారులు, విద్యార్థిని విద్యార్థులతో తో కలిసి మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ జీవరాశి మనుగడ, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమత్యులతను కాపాడటం లలో మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మొక్క చెట్లుగా ఎదిగి అవి కార్బన్ డై ఆక్సైడ్ తీసుకోని మనకు తిరిగి ఆక్సిజన్ అందించి మనల్ని కాపాడేందుకు అంతగా కృషి చేస్తుందని అన్నారు. భూ భాగములో జీవ కోటికి అత్యంత అవసరైమన వాటిలో మొక్కలు ప్రధానమైనవనీ భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలన్న, వర్షాలు కురవాలన్నా, కాలుష్యం నివారణ చేయాలన్న చెట్లు నాటడం ద్వారానే సాధ్యమవుతుందన్నారు.

మొక్కలు నాటడం వలన పచ్చదనాన్ని పెంచి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందన్నారు. పచ్చదనం లేకుంటే వాతావరణ కాలుష్యం ఏర్పడి ప్రతి ఒక్కరు అనారోగ్యం పాలవుతున్నారని, మొక్కల పెంపకంతో మానవ మనుగడ సాగుతుందని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని, మనల్ని మనం కాపాడుకోవడం కోసం , భావితరాలకు సమతుల్య వాతావరణం చక్కటి ఆహ్లాదకరమైన వాతవరణం అందించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఇతరులతో కూడా చెట్లను నాటెల చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి అడ్మిన్ సి.రాజు, గోదావరి ఖని ఏసీపీ రమేష్, పెద్దపల్లి ఏసిపి జి కృష్ణ మంచిర్యాల ఏసిపి ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసిపి వెంకటేశ్వర్లు బెల్లంపల్లి ఏసిపి రవి కుమార్, టాస్క్ ఫోర్ సి ఏ సి పి మల్లారెడ్డి, సి సి ఎస్ ఏ సి పి వెంకటస్వామి, ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, ఎఆర్ ఎసిపి ప్రతాప్, సురేంద్ర, ఏఓ అశోక్ కుమార్, కమీషనరేట్ పరిధి సీఐఐ లు, ఎస్ఐ లు,  రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు  దామోదర్, మల్లేషం, శ్రీనివాస్, మధు, వామన మూర్తి, సూపరింటెండెంట్ లు ఇంద్ర సేనా రెడ్డి, సంధ్య, మనోజ్ కుమార్, సిసి పవన్ రాజ్, గౌస్, అటవీ శాఖ అధికారులు, రామగుండం ప్రభుత్వం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Plant care is everyone's responsibility