Pilot Project : పెద్దపల్లి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలు

TRINETHRAM NEWS

మధ్యాహ్న భోజనం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విద్యాశాఖ కార్యదర్శి
పెద్దపల్లి, ఏప్రిల్ -02// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆన లైన్ ద్వారా మధ్యాహ్న భోజన చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ అన్నారు బుధవారం హైదరాబాద్ నుంచి విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ , విద్యాశాఖ సంచాలకుల నరసింహారెడ్డి తో కలిసి మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపు పై జిల్లా కలెక్టర్లు విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు
ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ మాట్లాడుతూ, ట్రెజరీ ద్వారా మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఆలస్యం అవుతుందని, నేరుగా ఆన్ లైన్ నుంచే మధ్యాహ్న భోజనం బిల్లులు చెల్లించేందుకు గల అవకాశాలను విద్యాశాఖ పరిశీలిస్తుందని తెలిపారు ఏప్రిల్ నెలలో పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలో ప్రతిరోజు విద్యార్థుల హాజరు నమోదు చేసే లో సాఫ్ట్వేర్ క్షేత్ర స్థాయిలో పంపాలని, వీటి ద్వారా విద్యార్థులు హాజరు నమోదు చేస్తూ బిల్లుల తయారీ చర్యలు చేపడుతామని అన్నారు రాష్ట్రంలో ముందస్తుగా పెద్దపెల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఆన్ లైన్ బిల్లులో చెల్లింపు ప్రారంభిస్తున్నామని తెలిపారు.

పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లాలలో ముందుగా ఒక మండలాన్ని ఎంపిక చేసుకుని, నెలరోజుల పాటు ఆ మండలం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన బిల్లులను ఆన్ లైన్ ద్వారా త్వరితగతిన చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు పైలెట్ ప్రాజెక్టు నుంచి వచ్చే ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ చెల్లింపులు జరపడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, జిల్లా లోని పాఠశాలలకు లాగిన్ ఐడి లు తయారు చేసి అందిస్తే ప్రతి రోజూ హజరు వివరాలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తామని అన్నారు
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pilot project implemented in

You cannot copy content of this page

Scroll to Top