
సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులంతా పాల్గొనాలని రాష్ట్ర కార్యవర్గం పిలుపు
PSCWU రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ యాకూబ్ షావలి, తోకల రమేష్ పిలుపు
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ TUCI రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశము జరిగింది. ఈ సమావేశంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల స్థితిగతులపై చర్చించడం జరిగింది. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుకై సింగరేణి వ్యాప్తంగా మళ్లీ ఉద్యమించాలని వివిధ రూపాల్లో పోరాటాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మార్చి ఒకటి నుంచి ఐదు వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా మళ్లీ కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు మంత్రులకు కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదలపై వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది.
ఇప్పటికే అనేక దఫాలుగా తెలంగాణ ఎమ్మెల్యేలకు మంత్రులకు కాంట్రాక్టు కార్మికుల బాధలను వివరిస్తూ అనేకసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీనీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క పైసా వేతనం కూడా పెరగలేదు. తిరిగి మరొక్కసారి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదలపై మాట్లాడాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రులకు ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులంతా కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
కలిసివచ్చే శక్తులతో విశాల ఐక్య పోరాటాన్ని నిర్మించే క్రమంలో ముందుకు సాగుతామని కలిసి వచ్చే శక్తులన్నింటితో విశాల ఐక్యవేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తామని సింగరేణిలో బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించే దిశగా అగ్రభాగాన ఉండి కార్మిక సమస్యల పరిష్కారానికి వేతనాల పెంపుకై రాజీలేని కొనసాగిస్తామని పిలుపునిచ్చారు.ఇంకా ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పెద్ద బోయిన సతీష్,రాష్ట్ర కోశాధికారి సి వై పుల్లయ్య
రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్ శరత్, పాయం వెంకన్న, చంద్రశేఖర్ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
