
Trinethram News : హైదరాబాద్:డిసెంబర్ 10
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాల హామీతో అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని తక్షణమే అమలు చేయాలని ప్రజలు అభ్య ర్థిస్తున్నారు.
కాకపోతే ఆయా పథకాలు పొందాలంటే రేషన్‌కార్డులు కీలకం కానున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రేషన్ కార్డు అనేది అత్యంత ప్రాధాన్యం.
దీంతో తమకు నిరాశ తప్పదని ఇప్పటి వరకు కార్డు పొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు.కొత్త ప్రభుత్వం రేషన్ కార్డులు జారీచేసే ప్రక్రియపై ఫోకస్ చేయాలని వారు కోరుతున్నారు.
కార్డులు లేక ఎన్నో ఏళ్లుగా సంక్షేమ పథకాలకు దూరమ య్యామని,అలాగే రేషన్ బియ్యం పొందలేక పోతు న్నామని పలువురుఆవే దన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పడు ఏర్పడిన కొత్త ప్రభుత్వమైనా తమకు రేషన్‌కార్డులు ఇవ్వాలని ప్రజలు కొత్త ప్రభుత్వపై కోటి ఆశలు పెట్టుకున్నారు…..
