Celebrate the 3rd Mahasabha of Peddapally District Motor Worker Union to be held on 14th of this month
మహాసభ పోస్టర్ ఆవిష్కరణలో మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రవి కుమార్.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపెల్లి జిల్లా మోటార్ వర్కర్స్ యూనియన్ మూడవ మహాసభ (కామ్రేడ్ యు రాములు నగర్) IFTU కార్యాలయంలో ఎన్ టి పి సి. జ్యోతి నగర్ లో నిర్వహించడం జరుగుతుంది.
ఈ సందర్భంగా మహాసభ వాల్ పోస్టర్ ను గోదావరిఖని గంగానగర్ లైన్ లారీల యాడ్ వద్ద ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మోటార్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎడ్ల రవికుమార్* మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో సుమారు 25 లక్షల మంది మోటార్ రంగంలో పనిచేస్తున్నారని వీరికి ఎలాంటి రక్షణ భద్రత లేదన్నారు.
మోడీ ప్రభుత్వం మోటార్రంగా కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని అందులో భాగంగానే పెనాల్టీలు అక్రమ వసూళ్లు విచ్చలవిడిగా పెంచారని దీంతో డ్రైవర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని దీనివల్ల డ్రైవర్ల కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ఈట్ & రన్ చట్టాన్ని రద్దు చేయాలని ఈ చట్టం వల్ల డ్రైవర్లకు తీవ్రంగా నష్టం జరిగే పరిస్థితి ఉందన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న విధానాలు ఈనెల 14న జరిగే మహాసభల్లో చర్చించి తీర్మానం చేయాల్సి ఉంటుందని ఈ మహాసభకు అన్ని రకాల వాహనాల డ్రైవర్లు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మోటార్ వర్కర్స్ యూనియన్ (IFTU ) నాయకులు మద్దెర్ల మైపాల్, ఎనగంటి లడ్డు (సతీష్), ఏ దామోదర్, కే మల్లేష్, వెంకటేష్, గురుదత్త సాయి, టీ రఘు, రాజయ్య.పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App