Security of migrant laborers from other states rests with employers: Peddapally ACP Gaji Krishna
పెద్దపల్లి, బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ ల పరిధిలోని రైస్ మిల్స్, ఇటుక బట్టీల యాజమాన్యం తో సమావేశం
ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వలస కూలీల భద్రత యజమానులదే: పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్., (ఐజీ) ఆదేశాల మేరకు పెద్దపల్లి డిసిపి చేతన ఐపిఎస్.,ఉత్తర్వుల ప్రకారం రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పెద్దపల్లి, బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ ల పరిధిలోని 15 రైస్ మిల్స్, మరియు 40 ఇటుక బట్టిల,15 హోటల్స్ ల అసోసియేషన్ సభ్యులతో బసంత్ నగర్ లోని రాధా కృష్ణ ఫంక్షన్ హల్ లో సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ పొట్టకూటి కోసం వలస కూలీలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే, ఇతర కూలీల భద్రత రైస్ మిల్స్, ఇటుక బట్టి, హోటల్స్ యజమానులదే అన్నారు.
ప్రతి రైస్ మిల్లు మరీయు ఇటుక బట్టీల, హోటల్స్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి మరియు వాటిని నిరంతరం పర్యవేక్షిస్తుండాలి.
ఇతర రాష్ట్రాల నుండి, ఇతర ప్రాంతాల నుండి కూలీలను తీసుకువచ్చిన్నపుడు వారి వివరాలు నమోదు చేసి రిజిస్టార్ మైంటైన్ చేయాలి సంబంధిత శాఖ తెలపాలి.
మగ కూలీలు, ఆడ కూలీలకు వేరువేరుగా నివాస ప్రాంతాలను ఏర్పాటు చేయాలి.
కుటుంబ సభ్యులతో ఉండేటువంటి కూలీల కి వేరుగా నివాస ప్రాంతాలు ఏర్పాటు చేయాలి.
రైస్ మిల్, హోటల్స్ మరియు ఇటుక బట్టీల, యజమానులు తమ వద్ద పనిచేసేటువంటి కూలీల యొక్క గత చరిత్రను తెలుసుకోవాలి మరియు చెడు అలవాట్లు ( మద్యం గంజాయి డ్రగ్స్ )కలిగిన వారి వివరాలు సేకరించి వారిని పనిలో ఉంచుకోకుండా చూడాలి.
రైస్ మిల్ మరియు ఇటుక బట్టి, హోటల్ ప్రాంతాల్లో సెక్యూరిటీ గార్డ్స్ ఏర్పాటు చేసుకొని రిజిస్టర్లు ఏర్పాటు చేసి ఇన్-అవుట్ అయ్యో వారి వివరాలు పూర్తిగా నమోదు చేయాలి.
మిల్స్, బట్టిల లో కూలీల చేత వెట్టిచాకిరి చేయించ వద్దని, కార్మిక చట్టాలు కచ్చితంగా పాటించాలన్నారు.
హోటల్, వంట గది మరియు పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుకోవాలి
ఉపయోగించిన నూనె, ఇతర ముడి పదార్థాలను, మరల ఇతర ఆహార పదార్థాల తయారీకి ఉపయోగించకూడదు.
వారికీ కనీస అవసరాలు అనగా త్రాగునీరు, సరైన వసతి, ఆసుపత్రిలను ఏర్పాటు చేయక పోవడం, చిన్న చిన్న గదులలో వారి నివాసలల్తో ఇబ్బందులు పడకుండా కనీస ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ , బసంత్ నగర్ ఎస్సై స్వామి, పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మన్, ధర్మారం ఎస్ఐ సత్యనారాయణ, రైస్ మిల్ మరియు ఇటుక బట్టీల, హోటల్స్ యజమానులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App