TRINETHRAM NEWS

రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎరవల్లి ముత్యంరావు,

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అర్జి1 బ్రాంచి కమిటీ సమావేశం ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన గోదావరిఖని శ్రామిక భవన్లో జరిగింది, ముఖ్య అతిధులుగా తుమ్మల రాజారెడ్డి, ఎరవల్లి ముత్యం రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అన్ని రకాల దోపిడీ, అణిచివేత, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడి, వీటి నుండి శ్రామిక వర్గాన్ని విముక్తి చేసి, పెట్టుబడిదారి సమాజానికి ప్రత్యామ్నాయంగా కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో సిఐటియు పనిచేస్తున్నదని, అందులో భాగంగా ఏప్రిల్ 6న కార్మిక ఉద్యమ నేత సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బీటీ రణదీవే వర్ధంతి నుండి ఏప్రిల్ 14 న భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ బి.

ఆర్ అంబేద్కర్ జయంతి వరకు సామాజిక న్యాయం సాధన క్యాంపెయిన్ చేయాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 10న శ్రామిక మహిళా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు చేసిన ఉద్యమ నేత విమల రణదీవే జయంతి, ఏప్రిల్ 11న భారతీయ సామాజిక సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించాలని, ఈ క్యాంపెయిన్ సందర్భంగా “సమకాలిన పరిస్థితుల్లో భారత రాజ్యాంగం అంబేద్కర్ కార్మిక వర్గ కర్తవ్యం” అనే అంశంపై సదస్సులు, సెమినార్లు నిర్వహించాలని, ఏప్రిల్ 8, 9, 10 తేదీల్లో సామాజిక ఉద్యమ సంఘీభావ నిధిని కార్మికుల్లో, ఉద్యోగుల్లో విరివిగా సేకరించాలని అన్నారు.

ఏప్రిల్ 13న జిల్లా కేంద్రాల్లో సామాజిక న్యాయ సాధన బైక్ ర్యాలీలు నిర్వహించాలని, ఏప్రిల్ 14న సిఐటియు అనుబంధ సంఘం సంఘాలు అన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరపాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ ప్రైవేటు కరణ ఆపాలని, కార్పోరేట్, మతోన్మాద విధానాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేస్తూ మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి మేదరి సారయ్య, అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, తోట నరహరి రావు, కారం సత్తయ్య, ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్, ఆసరి మహేష్, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, సానం రవి, పిట్ కార్యదర్శులు దాసరి సురేష్, అన్నబోయిన శంకర్, వంగల శివరామిరెడ్డి, ఈదా వెంకటేశ్వర్లు, జంగపల్లి మల్లేష్, నంది నారాయణ, పిట్ అసిస్టెంట్ కార్యదర్శులు, ఈ సాగర్, ఎస్ శ్రీనివాస్, ఆర్గనైజర్స్ పెద్దపల్లి శశి కుమార్, జనార్దన్ రెడ్డి, తాళ్ల శ్రీనివాస్, శ్రావణ్, సానబోయిన సాయి ప్రకాష్, 30 మంది కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pay homage to the founder