Pawan Kalyan : జనసేన అభ్యర్థులపై పవన్ కసరత్తు..నేతల బలా బలాలపై నాదెండ్ల ఫోకస్
Pawan Kalyan : అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రస్తుతం తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. శాసన సభ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా అభ్యర్థులు ఎవరనే దానిపై ఫోకస్ పెట్టారు.
గుంటూరు జిల్లా మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చర్చలు జరిపారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) , నాదెండ్ల మనోహర్. ఈ సందర్బంగా నేతల బలాబలాలపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు. ఎలాగైనా సరే ఈసారి ఏపీలో వైసీపీని ఓడించాలని , ఇందుకు సంబంధించి కలిసి వచ్చే పార్టీలు, నేతలతో సమాలోచనలు జరపాలని నిర్ణయించారు జనసేన పార్టీ చీఫ్.
ఈ మేరకు టీడీపీ, జనసేన ఉమ్మడిగా వైసీపీని ఢీకొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు గత మూడు రోజులుగా చర్చలు జరిపారు. ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ పట్టణః, కృష్ణా , గుంటూరు, తిరుపతి, అనంతపురం, ప్రకాశం జిల్లాల జనసేన నేతలతో సమావేశం అయ్యారు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్. ఇప్పటి దాకా 16 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు.
సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడుతో పవన్ భేటీ కానున్నట్లు సమాచారం.