గిరిజన గుడెల్లో (పి.వి.టీ.జి) వికాస్ యోజన కు అరకొర నిధులు
(గిరీ నేత చిన్నబాబు)
అల్లూరిజిల్లా అరకులోయ,జనవరి 21,త్రినేత్రం న్యూస్.
అరకు వేలి మండలం సుంకర మెట్ట పంచాయతీ సంఘం వలస ,దాబు గుడా గ్రామంలో పర్యటన చేసి పీఎంపీ జన్ మాన్ వికాస్ యోజన ఇల్లు నిర్మాణ పనులను పరిశీలిస్తున్న, ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షులు గెమ్మెల చిన్న బాబు.
చిన్న బాబు మాట్లాడుతు, ప్రభుత్వం ఇల్లు నిర్మాణనికి ఇస్తున్న 2.39లక్షల సరిపోతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఇల్లు నిర్మానికి సిమెంట్, ఐరన్ ఇతర ముడి సరుకులు రేట్లు భారీ పెరగడంతొ ప్రస్తుతం పీఎం – జన్మన్ కింద ఒక ఇల్లు నిర్మాణనికి ప్రభుత్వం ఇస్తున్న యూనిట్ కాస్ట్ 2లక్ష ల 39 వేయిలు గిరిజన ప్రాంతంలో ఇల్లు నిర్మాణనికి ఏ మూలకి సరిపోవు కావున ఒక్కో ఇల్లు నిర్మాణానికి, 5 లక్షలకు పెంచాలి.2లక్షల 39 వేయిల తొ ఇల్లు నిర్మాణం చేపటితే ఏ గ్రామానికి వెళ్లిన మొండి గోడలతొ దర్శనం ఇస్తాయని, ప్రధాన మంత్రి ప్రతిష్టత్మకంగా ప్రవేశపెట్టిన పీఎంపీ జన్మన్ వికాస్ యోజన ఇల్లు ప్రసారం ఆర్బటానికే తప్ప నిజంగా పేద వాడి సొంతింటి కల నెరవేరాదని అన్నారు. ఇదే విషయాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు ఎంపీ,ఎమ్మెల్యే ,ఐటీడీఏ అధికారులు, జిల్లా కలెక్టర్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలి.అలాగే గిరిజన ప్రాంతంలో ప్రతి ఇల్లులేని పేద కుటుంబాలకు,పీఎంపీ జన్మన్ వికాస్ కింద ఇల్లు మంజూరు చేయాలి.పీఎం -జన్మన్ హౌసింగ్ సర్వేలో సాంకేతిక కారణాలు వలన రిజెక్ట్ అయిన పేర్లును అర్హులుగ గుర్తించి ఇల్లు మంజూరు చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో లబ్ధిదారులతొ కలిసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోగ్రామస్తులు లబ్ధిదారులు,మూర్తి,ప్రేమ్ కుమార్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App