TRINETHRAM NEWS

Paritala Sriram praised the boy’s talent at an early age

విభిన్నమైన సైకిల్ తయారు చేసిన 13ఏళ్ల ముబారక్

ఇటీవల కళాశాల గ్రౌండ్ లో సైకిల్ ను చూసిన శ్రీరామ్

సైకిల్ కి అవసరమైన మోటార్, బ్యాటరీ అందించిన శ్రీరామ్

ముబారక్ తెలివితేటలు అమోఘం పరిటాల శ్రీరామ్

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

13ఏళ్ల వయసులోనే ఒక భిన్నమైన సైకిల్ తయారు చేసిన బాలున్ని ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ ప్రసంశించారు. ఇటీవల ప్రభుత్వ కళాశాల గ్రౌండ్ లో హాకీ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి హాజరైన శ్రీరామ్ అక్కడ ఒక బాలుడు తొక్కుతున్న సైకిల్ చూసి పలుకరించాడు. అది సహజంగా ఉండే సైకిల్ లా కాకుండా ప్రత్యేకంగా కొన్ని పార్టులతో తయారు చేసినట్టుగా గుర్తించారు. వెంటనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.

19వ వార్డుకు చెందిన ముబారక్ 8వ తరగతి వరకు చదివి ఆర్థిక పరిస్థితుల వల్ల చదువును మధ్యలో వదిలేసి ఆటోమెకానిక్ షాపులో పని చేస్తున్నాడు. ఈక్రమంలో తనకు ఒక భిన్నమైన సైకిల్ తయారు చేయాలని భావించాడు. తనకున్న తెలివితేటలతో కొన్ని పాత పార్టులు తీసుకుని అద్భుతంగా సైకిల్ తయారు చేశాడు. అయితే బాగా నడవాలంటే బ్యాటరీ, మోటార్ అవసరం. కానీ అవి కొనేందుకు డబ్బులు లేక అలాగే వాడుతున్నాడు. ఇది చూసిన పరిటాల శ్రీరామ్ వివరాలు తెలుసుకుని..

బెంగళూరునందు సైకిల్ కి అవసరమైన మోటార్, బ్యాటరీ కొనుగోలు చేసి వాటిని శనివారం బాలుని ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. అంతే కాకుండా చిన్న వయసులోనే ప్రతిభ కనబరిచిన ముబారక్ ను అభినందించి పూలహారం వేసి సన్మానం చేశారు. భవిష్యత్ లో ఏ అవసరం ఉన్నా తనని సంప్రదించవచ్చని ఆ బాలునికి శ్రీరామ్ భరోసా ఇచ్చారు దీంతో ముబారక్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Paritala Sriram praised the boy's talent at an early age