TRINETHRAM NEWS

Trinethram News : రాజమహేంద్రవరం:స్థానిక ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి లో చిన్నపిల్లల విభాగం ,డైస్ సెంటర్ లో “నోటి ఆరోగ్య దినోత్సవం” కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా డెంటల్ సర్జన్ డాక్టర్ విశ్వనాథ్ మాట్లాడుతూ , దంత సంరక్షణ, ఆరోగ్య సమస్యలు గురించి అవగాహన ప్రతి ఒక్కరు కలిగి ఉండాలన్నారు. తప్పనిసరిగా దంతాల సంరక్షణ విషయంలో అజాగ్రత్త తగదన్నారు. ప్రతి రోజూ తప్పనిసరిగా రెండుసార్లు దంతాలను తోముకోవాలనీ కోరారు.

డెంటల్ హైజనిస్ట్ డా. సూర్య వర్మ నోటి పరిశుభ్రత, వాటిని పాటించాల్సిన నియమాలు, టెక్నిక్స్ గురించి తెలియ చేశారు. దంతాలు ఆరోగ్యంగా ఉన్నా కూడా ఏదైనా సందేహాలు ఉంటే డాక్టరు ను సంప్రదించి తగిన చికిత్స పొందాలని కోరారు..

సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులకు నోటి శుభ్రత గురించి పూర్తిగా వివరించారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ హరిచంద్ర ప్రసాద్ డాక్టర్ మోహన్ చంద్ర, చిన్నపిల్లల హెచ్వోడి డాక్టర్ ఇంద్రజ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ క్రాంతి సౌజన్య , డైస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Oral Health Day