ఈనెల 15న మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి పరిగి నియోజకవర్గానికి మంత్రులు రాక
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్రిక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డిసిసి ఉపాధ్యక్షులు లాల్ కృష్ణా మరియు మండల అధ్యక్షులు,మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి మాట్లాడుతూ… ఈనెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం రోజు పరిగి మరియు కుల్కచర్ల మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు మరియు పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ధనసరి అనసూయ సీతక్క మరియు దేవదాయ శాఖ మాత్యులు కొండా సురేఖ మరియు పరిగిశాసనసభ్యులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి మరియు జిల్లా ఎమ్మెల్యేలు అతిథులుగా విచ్చేస్తున్నారని తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App