Office of the District Medical and Health Officer, Peddapally
పల్లె దవాఖానలలో హెచ్. ఐ.వి. స్ర్కీనింగ్ పరీక్షలు
యం.ఎల్.హెచ్.పిలకు శిక్షణ
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కమీషనర్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, హైదరాబాద్ మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్ (తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సోసైటి) ఆదేశాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సమూదాయల యందలి సమావేశ మందిరం లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (పల్లెదవాఖాన) లలో పని చేయుచున్న యం.ఎల్.హెచ్.పిలకు హేచ్.ఐ.వి. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించుటకు ఒక రోజు (1) శిక్షణ నిర్వహించామని డా. కె. ప్రమోద్ కుమార్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అదికారి, పెద్దపల్లి అన్నారు.
ఇప్పటి నుండి జిల్లాలోని వివద ఆసుపత్రులలో గల ఐ.సి.టి.సి కేంద్రములతో పాటు పల్లె దవాఖానలో కూడా హెచ్.ఐ.వి. పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమములో డా. జి. అన్నప్రసన్న కుమారి, ఎ.డి.పి.హెచ్.ఒ, డా. కె.వి. సుధాకర్ రెడ్డి, ప్రోగ్రామ్ అధికారి, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ మెనెజర్,కె. సురెందర్ రెడ్డి,పి. ఆర్. శ్రీనివాస్, జిల్లా ఐ.సి.టి.సి. సూపర్ వైజర్,జి. శంకర్,కట్కూరి శంకర్, సత్యానందం మరియు రవికుమార్ జిల్లా ఐ.సి.టి.సి. కౌన్సిలర్ లు పాల్గోన్నారు.
సుల్తానాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రుల ఆకస్మిక తనిఖీ
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, డా. కె. ప్రమోద్ కుమార్ కార్యాలయ సిబ్బందితో ఆకస్మికంగా సుల్తానాబాద్ లో నిర్వహించుచున్న ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ నిర్వహించారు. అనుమతులు లేకుండా నడుపుచున్న పిల్లల ఆసుపత్రి మరియు రెండు (2) దంత వైద్యశాలలకు నోటిసులిచ్చి అనుమతులు పొందే వరకు మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశాం అని అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రులు నడిపే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటాము అని అన్నారు. ప్రతి ఆసుపత్రి నందు ధరల పట్టిక, సేవలు అందించు డాక్టర్ల వివరాలు మరియు సేవల వివరాలను రిసిప్షన్ కౌంటర్ లో ప్రదర్శించాలి అని అన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App