
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వేతనాలు పెంచాలని రెండురోజులుగా జరుగుతున్న పి.సి.పటేల్ కంపెనీ ఓ.సి.పి.5 కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు సీఐటీయూ మద్దతు తెలుపడం జరిగింది. ఈరోజు ఓ.సి.పి.5 లో సమ్మెలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి కలిసి మాట్లాడుతూ రెండు రోజులుగా కార్మికులు తమకు వేతనాలు పెంచాలని అనేకసార్లు కోరినప్పటికీ యాజమాన్యం వినిపించుకోని పక్షంలో సమ్మెకు దిగాల్సి వచ్చిందని అన్నారు.
వీరితో పాటు రామగుండం రీజియన్ లో ఉన్న అన్ని ఓ.బి. ల కాంట్రాక్ట్ కార్మికులు కూడా వేతనాలు పెంచాలని సమ్మెకు దిగాలని అన్నారు. వీరందరి సమస్య కూడా వేతనాలు పెంచాలని అన్నారు. సింగరేణికి లాభాలు రావడంలో కీలక పాత్ర కాంట్రాక్ట్ కార్మికులదే అన్నారు. ఉత్పత్తిలో, లాభాల్లో భాగస్వామ్యం అవుతున్న వీరికి మాత్రం కనీస వేతనాలు లేవని అన్నారు. చాలీ చాలని వేతనాలతో వెట్టిచాకిరి చేయిస్తున్నారని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని,కనీస వేతనం 26 వేలు ఉండాలని, సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలని, కొలోండియ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక నెల రోజుల్లో కొలిండియ వేతనాలు ఇప్పిస్తామన్న రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలిచి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు కొలిండియ వేతనాలపై మాట్లడడం లేదని అన్నారు.
వెంటనే ఓ.బి. కాంట్రాక్ట్ కార్మికులకు జీ.ఓ. ప్రకారం వేతనాలు చెల్లించాలని లేదంటే పోరాటం కొనసాగిస్తామని సమ్మెలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతు ఇవ్వడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
