
ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి వినతి
Nursery Farmers Issues : త్రినేత్రం న్యూస్, కడియం: కడియం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు విచ్చేసిన రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు కడియపులంకలోని సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు బొర్సు సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు ఎంపీ, ఎమ్మెల్యేలకు మొక్కలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నర్సరీ రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వారితో చర్చించారు. నర్సరీ రైతులకు అవసరమైన జేసీబీని ప్రభుత్వ రాయితీపై అసోసియేషన్‌కు మంజూరు చేయాలని కోరారు. అలాగే నర్సరీలకు అవసరమైన ఎర్రమట్టిని తరలించే లారీలపై కొవ్వూరు టోల్ ప్లాజా సమీపంలోని వే బ్రిడ్జి వద్ద వసూలు చేస్తున్న కాటా బిల్లును నర్సరీ రైతులకు మినహాయింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు నర్సరీ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తూ అసోసియేషన్ అధ్యక్షులు బొర్సు సుబ్బారాయుడు, పాలకవర్గ సభ్యులు ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి రిప్రజెంటేషన్ అందజేశారు. నర్సరీ రంగంపై ఆధారపడి జీవిస్తున్న రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుల్లా శ్రీను, సెక్రటరీ పాటంశెట్టి శ్రీనివాసరావు (వాసు), జాయింట్ సెక్రటరీలు బోడపాటి చంద్రశేఖర శ్రీనివాస్ (శేఖర్), అన్నందేవుల వెంకటేశ్వరరావు (బాబీ), ఉండమట్ల అర్జున్, జాయింట్ ట్రెజరర్లు గట్టా కృష్ణ భగవాన్, దూలం సత్యనారాయణమూర్తి, కోఆర్డినేటర్ సాన రాజు, పీఆర్వో కామిశెట్టి వెంకటేష్ (కేవీఆర్), డైరెక్టర్ తడాల సత్యనారాయణ, కో-ఆప్టెడ్ సభ్యులు నూనె వెంకటేశ్వరరావు, కడియం మండల అధ్యక్షులు వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, కడియపులంక సొసైటీ చైర్మన్ గట్టి నరసయ్య, కడియం మండల వైస్ ప్రెసిడెంట్ పంతం గణపతి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోడపాటి గోపాలకృష్ణ, ఆకుల శ్రీధర్, పాఠంశెట్టి రవి, కడియం సావరం మాజీ సర్పంచ్ చెక్కపల్లి మురళీకృష్ణ, దామిరెడ్డిపల్లి మాజీ ఉప సర్పంచ్ ముద్రగడ జేమి, ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణ, కోటికలపూడి వెంకటేశ్వరరావు, మార్గాని ఏడుకొండలు, వెలుగుబంటి నాని, అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మల్లు పోలరాజు, గట్టి సుబ్బారావు తదితర నర్సరీ రైతులు, పెద్దలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe