TRINETHRAM NEWS

అంతర్గాం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. అంతర్గాం మండలంలోని ఆకెనపల్లి గ్రామం లో ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ సహకారంతో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజల సంక్షేమం కోసం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ సహకారంతో ఎన్టిపిసి యాజమాన్యం మరియు అంతర్గం మండల పోలీసు శాఖ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకట్ సార్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు సంయుక్తంగా నిర్వహించడం జరిగినది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేక వైద్య బృందం గ్రామ ప్రజలకు పలు వైద్య పరీక్షలు చేసి ఉచిత మెడిసిన్ అందజేయడం జరిగినది. వైద్య పరీక్షలో పాల్గొన్న గ్రామ ప్రజలంతా ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ సహకారం పట్ల ఎన్టిపిసి యాజమాన్య సంస్థ పోలీసు శాఖ ఎస్సై వెంకట్ సార్ ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపు ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉన్నదని మా ప్రజలందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని హర్షం వ్యక్తం చేసినారు.

ఈ కార్యక్రమం లో కో-ఆర్డినేటర్ గాదె సుధాకర్, గ్రామ అధ్యక్షులు మర్రి రాజ్ కుమార్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంతెన మహేందర్ మాజీ సర్పంచ్ గంగాధరి శ్రీనివాస్ గౌడ్,మారాపెల్లి నరసింహారెడ్డి,ఫీల్డ్ అసిస్టెంట్ పవన్,సామల శ్రీనివాస్, గెల్లు కుమార్,కొల్లూరి సత్యనారాయణ, అడ్లూరి బాణయ్య, సున్నం కనుకయ్య,ఐలవేణి భీమయ్య,మెరుగు రవి,సామల రాయమల్లు,పూదరి స్వామి, రాయిల్ల శ్రీనివాస్,జిట్టావేణి కుమార్,ఐలవేణి సంతు,రాయిల్ల లక్ష్మణ్,ఉప్పులేటి సాయి, గ్రామపంచాయతీ సిబ్బంది,గ్రామ ప్రజలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

NTPC organization Rohini Foundation