New Virus : కొత్త వైరస్‌.. సోకిన 48 గంటల్లో చావే!

TRINETHRAM NEWS

కాంగోలో ఇప్పటికే 50 మందికిపైగా మృతి

Trinethram News : కాంగోలో ఒక రహస్యమైన, ప్రాణాంతకమైన వైరస్ వ్యాపిస్తోంది. 50 మందికి పైగా 48 గంటల్లోనే మరణించారు. జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావం లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఈ వైరస్‌ను ఇంకా గుర్తించలేదు. గబ్బిలం తినడం వల్ల వ్యాధి వ్యాప్తి చెందిందని అనుమానిస్తున్నారు. వైద్యులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ వ్యాధి ఏంటనేది ఇంకా వైద్యులు కూడా గుర్తించలేదు. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. వెస్ట్రన్‌ కాంగోలో ఈ అరుదైన, భయంకరమైన వైరస్‌ వ్యాప్తిని గుర్తించారు.

13 మందిని నుంచి రక్త నమూనాలను సేకరించి, కోసం కాంగో రాజధాని కిన్షాసాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్‌కు పంపినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. అన్ని నమూనాలు సాధారణ హెమరేజిక్ జ్వరం వ్యాధులకు ప్రతికూలంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది.

ఈ వ్యాధి లక్షణాలు.. జ్వరం, వాంతులు, అంతర్గత రక్తస్రావం(ఇంటర్నల్‌ బ్లీడింగ్‌) వంటివి కనిపిస్తాయి. జనవరి 21న ప్రారంభమైంది. ఇప్పటి వరకు 419 కేసులు నమోదయ్యాయి, 53 మరణాలు సంభవించాయని అధికారులు తెలియజేశారు.

అయితే కొన్నింటికి మలేరియా పాజిటివ్‌ అని రిపోర్ట్‌ వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ వ్యాధి పేరు కానీ, వైరస్‌ పేరు కానీ సైంటిస్టులు కనిపెట్టలేదు. దీన్ని అడ్డుకోకపోతే మరింత మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

New virus die within 48 hours

You cannot copy content of this page

Scroll to Top